గ్రహం అనుగ్రహం (01-05-2020) | Daily Horoscope in Telugu (01-05-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (01-05-2020)

May 1 2020 5:51 AM | Updated on May 1 2020 7:43 AM

Daily Horoscope in  Telugu (01-05-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి శు.అష్టమి ఉ.8.41 వరకుతదుపరి నవమి, నక్షత్రం ఆశ్లేష రా.8.44 వరకు, తదుపరి మఖ వర్జ్యం ఉ.9.55 నుంచి 11.30 వరకు, దుర్ముహూర్తం ఉ.8.11 నుంచి 9.01 వరకు, తదుపరి ప.12.21 నుంచి 1.13 వరకుఅమృతఘడియలు... రా.7.11 నుంచి 8.33 వరకు.

సూర్యోదయం :    5.39
సూర్యాస్తమయం    :  6.15
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు

గ్రహఫలం
మేషం: కార్యక్రమాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. కష్టం ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది.బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో వ్యయప్రయాసలు.

వృషభం: కష్టానికి తగ్గ  ఫలితం కనిపిస్తుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. రాబడి పెరుగుతుంది.వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళాకారులకు సన్మానాలు.

మిథునం: చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయం తగ్గుతుంది.బంధువిరోధాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. కళాకారులకు నిరుత్సాహం.

కర్కాటకం: రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. జీవితాశయం నెరవేరుతుంది. ఒక సంçఘటన ఆకట్టుకుంటుంది.పాతబాకీలు అందుతాయి. పనుల్లో విజయం. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

సింహం: రావలసిన బాకీలు అందక ఇబ్బంది పడతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. చోరభయం. మానసిక అశాంతి

కన్య: ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. దేవాలయ దర్శనాలు.

తుల: ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

వృశ్చికం: ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు.వ్యాపార, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యసమస్యలు.

ధనుస్సు: కుటుంబ, ఆరోగ్యసమస్యలు. వ్యవహారాలు ముందుకు సాగవు. అనారోగ్యం. బంధువులతో అకారణంగా తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. విలువైన వస్తువులు జాగ్రత్త.

మకరం: కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆత్మీయుల మరింత దగ్గరవుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. విందువినోదాలు.

కుంభం: కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆశ్చర్యకరమైన సంçఘటనలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. దేవాలయదర్శనాలు.

మీనం: ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. మానసిక అశాంతి. కార్యక్రమాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. దేవాలయ దర్శనాలు.

Advertisement
 
Advertisement
Advertisement