వైవీయూ సెట్-2016 నోటిఫికేషన్ విడుదల | YVU set-2016 released | Sakshi
Sakshi News home page

వైవీయూ సెట్-2016 నోటిఫికేషన్ విడుదల

Mar 23 2016 9:12 AM | Updated on Sep 3 2017 8:24 PM

యోగి వేమన వర్సిటీ(వైవీయూ)లో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే వైవీయూ సెట్-2016 నోటిఫికేషన్ జారీ అయింది.

నేటి నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ

కడప: యోగి వేమన వర్సిటీ(వైవీయూ)లో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే వైవీయూ సెట్-2016 నోటిఫికేషన్ జారీ అయింది. ఈనెల 23 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, పూర్తి చేసిన దరఖాస్తులను అప్‌లోడ్ చేసే ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు రూ. 400 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అపరాధ రుసుం లేకుండా మే 10 వరకు , రూ. 500 అపరాధ రుసుంతో మే 11 నుంచి 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను మే 18లోపు అప్‌లోడ్ చేయాలి. వైవీయూ, అనుబంధ కళాశాలల్లోని 28 విభాగాల్లో పీజీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ కోర్సుల్లో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వైవీయూ సెట్ కన్వీనర్ రఘునాథరెడ్డి తెలిపారు. ఇతర వివరాలను  వైవీయూ వెబ్‌సైట్‌ www.yogivemanauniversity.ac.in లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement