
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల సాధనకు ఈ నెల 10న అనంతపురంలో యువభేరి నిర్వహించనున్నారు. వైఎస్సా ర్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమా నికి హాజరు కానున్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ మంగ ళవారం మాజీ ఎంపీ అనంత వెంకట రామిరెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మె ల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, అనంతపురం అర్బన్ సమన్వయకర్త నదీమ్ అహ్మద్, రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకా ష్‌రెడ్డి, తాడిపత్రి సమన్వయకర్త పెద్దా రెడ్డి, కదిరి సమన్వయకర్త సిద్దారెడ్డి, మడకశిర సమన్వయకర్త తిప్పేస్వామితో కలసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
నగర శివారులోని ఎంవైఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న యువభేరీని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు బండి పరుశురాం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేంద్రరెడ్డి, ఎస్కేయూ అధ్యక్షుడు భానుప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు.