
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ సీపీ పార్టీకి విధేయత, క్రమశిక్షణ ముఖ్యమని, ఎవరు గీత దాటిన సహించే ప్రసక్తే లేదని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన శనివారం తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..సమస్యలుంటే పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకురావాలని.. మీడియా ముందుకు తీసుకువస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. పార్టీలో ఎంతటి వారైనా గీత దాటితే చర్యలు తప్పవన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని విజయసాయి రెడ్డి తెలిపారు. జనాభా ప్రతిపాదికన బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టామని ఆయన వెల్లడించారు.