'వరి రైతులకు న్యాయం చేయాలి' | YSRCP MLA Sujay krishna ranga rao visits Karada village | Sakshi
Sakshi News home page

'వరి రైతులకు న్యాయం చేయాలి'

Jan 18 2016 4:57 PM | Updated on May 29 2018 2:55 PM

ధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో తెరచి రైతులకు న్యాయం చేయాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు డిమాండ్ చేశారు.

బొబ్బిలి రూరల్ (విజయనగరం జిల్లా) : ధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో తెరచి రైతులకు న్యాయం చేయాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్వీ సుజయ్‌కృష్ణ రంగారావు డిమాండ్ చేశారు. సోమవారం విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కారాడ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.

రైతులు విక్రయించిన వరి ధాన్యానికి సత్వరమే చెల్లింపులు చేయాలని కోరారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను నవంబర్‌లోనే తెరిచి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదన్నారు. వచ్చే సీజన్‌లో అయినా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement