చంద్రబాబుకు ‘యాత్ర’ చూపించాలి | YSRCP Leader Vellampalli Srinivas Comments On Yatra Movie | Sakshi
Sakshi News home page

‘యాత్ర’ బాబుకు చూపించాలి’

Feb 8 2019 12:44 PM | Updated on Feb 8 2019 4:14 PM

YSRCP Leader Vellampalli Srinivas Comments On Yatra Movie - Sakshi

సాక్షి, విజయవాడ : దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా చాలా బాగుందని, వైఎస్సార్‌ పాటించిన విలువలు, విదేయతలను తెరపై ఆవిష్కరించారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకోవడం, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలు చక్కగా చూపించారని చెప్పారు. యువరాజ్‌ థియేటర్‌లో సినిమా చూసిన అనంతరం మాల్లాది విష్ణుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

రాజశేఖరరెడ్డి పాదయాత్ర విశేషాలను ప్రత్యేకంగా చూపించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది తెలుగు ప్రజలంతా తప్పక చూడాల్సిన సినిమా అని పేర్కొన్నారు. ఓట్లు దండుకోవడమే పరమావధిగా ప్రజల్ని మభ్యపెట్టాలని చూసే చంద్రబాబుకు ఈ సినిమా చూపించాలని శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు. ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకుని.. అధికారంలోకి రాగానే వారి సమస్యలు పరిష్కారం కోసం అనుదినం పనిచేసిన మహానేత వైఎస్సార్‌ మార్గంలో మేమంతా పనిచేస్తాం’ అని మల్లాది విష్ణు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement