వైఎస్సార్‌సీపీ నాయకుడు, వైఎస్సార్ జిల్లా మడూరు గ్రామ మాజీ సర్పంచ్ మర్రిబోయిన ఓబులేసు(53)ను గుర్తుతెలియని దుండగులు శుక్రవారం రాత్రి దారుణంగా హత్య చేశారు.
ప్రొద్దుటూరు: వైఎస్సార్‌సీపీ నాయకుడు, వైఎస్సార్ జిల్లా మడూరు గ్రామ మాజీ సర్పంచ్ మర్రిబోయిన ఓబులేసు(53)ను గుర్తుతెలియని దుండగులు శుక్రవారం రాత్రి దారుణంగా హత్య చేశారు. ప్రొద్దుటూరు పట్టణానికి వచ్చి ఇం టికి వెళ్లే సమయంలో మార్గమధ్యలో కాపుకాసిన నలుగురు వ్యక్తులు కళ్లల్లో కారం చల్లి ఓబులేసును గొంతుకోసి హతమార్చినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. ఈయనకు భార్య ఈశ్వరమ్మ, ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.