సాక్షి, అమరావతి: తమ పార్టీ కార్యకర్తలుగా, సానుభూతిపరులుగా ప్రచారం చేసుకుంటూ కొంతమంది సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులతో వైఎస్సార్‌సీపీకి ఎలాంటి సంబంధంలేదని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇలా పార్టీ పేరు ఉపయోగించుకుని సోషల్ మీడియాలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కొంతమంది వ్యక్తులను గుర్తించినట్టు ఆ పార్టీ పేర్కొంది.
సోషల్ మీడియాలో వారు పెడుతున్న పోస్టులకు గానీ, జగన్ కోసం.. అంటూ వారు నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రూపులు, ఫేస్ బుక్ పోస్టులతో వైఎస్సార్‌సీపీకి ఎలాంటి సంబంధం లేదని పార్టీ స్పష్టం చేసింది. ఇలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న ఇప్పాల రవీంద్రారెడ్డి, వర్రా రవీంద్రారెడ్డి, యశ్వంత్‌రెడ్డి, ఆనం నరేంద్రరెడ్డి, ఎ.సతీష్‌రెడ్డితో తమ పార్టీకి సంబంధంలేదని వెల్లడించారు.
‘ఆ సోషల్ మీడియా పోస్టులతో వైఎస్సార్‌సీపీకి సంబంధం లేదు’
May 16 2018 4:02 AM | Updated on Oct 22 2018 6:10 PM
Advertisement
Advertisement