చిత్తూరు, కర్నూలు, కృష్ణా, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆదివారం జరిగిన మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలలో వైఎస్‌ఆర్‌సీపీ ఐదు మండల పరిషత్‌లను కైవసం చేసుకోగా, టీడీపీ రెండిటిని దక్కించుకుంది.
సాక్షి నెట్‌వర్క్ : చిత్తూరు, కర్నూలు, కృష్ణా, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆదివారం జరిగిన మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలలో వైఎస్‌ఆర్‌సీపీ ఐదు మండల పరిషత్‌లను కైవసం చేసుకోగా, టీడీపీ రెండిటిని దక్కించుకుంది. విజయనగరం జిల్లా మెంటాడ, తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం, కృష్ణాజిల్లా ఆగిరిపల్లి, చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెం, కర్నూలు జిల్లా కొత్తపల్లి ఎంపీపీ పీఠాలను వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంది.
‘పశ్చిమ’లో వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులకు బెదిరింపులు, ప్రలోభాలు
సాక్షి, ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ కుటిల రాజకీయాలకు పాల్పడి దేవరపల్లి మండల పరిషత్ అధ్యక్ష పదవిని తన్నుకుపోయింది. ఇక్కడ టీడీపీ దౌర్జన్యాల వల్ల ఈ నెల 4న ఎంపీపీ ఎన్నిక నిలిచిపోగా ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఆదివారం ఎన్నిక నిర్వహించారు. ఎంపీటీసీ ఎన్నికల్లో మండలంలో మెజారిటీ స్థానాలు వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఉన్నా టీడీపీ ఇద్దరిని ప్రలోభాలకు గురిచేసి తమవైపునకు తిప్పుకుంది. ఈ నేపథ్యంలో లాటరీలో ఆ స్థానాన్ని దేశం చేజిక్కించుకుంది.