వైఎస్సార్‌ చిన్నాన్న పురుషోత్తంరెడ్డి కన్నుమూత | YSR uncle and former MLA Purushotham Reddy passes away | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ చిన్నాన్న పురుషోత్తంరెడ్డి కన్నుమూత

Sep 6 2018 3:52 AM | Updated on Sep 6 2018 3:52 AM

YSR uncle and former MLA Purushotham Reddy passes away - Sakshi

పురుషోత్తంరెడ్డి(ఫైల్‌)

కడప కార్పొరేషన్‌: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి చిన్నాన్న, మాజీ ఎమ్మెల్యే, ప్రముఖ కంటి వైద్య నిపుణుడు డాక్టర్‌ వైఎస్‌ పురుషోత్తంరెడ్డి కన్నుమూశారు. గుండెకు సంబంధించిన వ్యాధితో వైఎస్సార్‌ జిల్లా కడపలోని సన్‌రైజ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం ఉదయం 6 గంటలకు తుది శ్వాస విడిచారు. వైఎస్‌ రాజారెడ్డి తమ్ముడైన పురుషోత్తంరెడ్డి పులివెందులలోని వైఎస్‌ రాజారెడ్డి హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌గా ఉంటూ  లక్షలాది మంది పేదలకు ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహించారు.

ఈయనకు డా. సత్యానందరెడ్డి, థామస్‌రెడ్డి, స్టాన్లీ రెడ్డి, మైఖేల్‌రెడ్డి అనే నలుగురు కుమారులు ఉన్నారు.  పురుషోత్తంరెడ్డి మృతికి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. కడపలో వైఎస్‌ పురుషోత్తంరెడ్డి భౌతికకాయానికి మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి నివాళులర్పించారు. ప్రముఖ కంటి వైద్య నిపుణులు డా. రామిరెడ్డి, డా.సురేష్‌బాబు, మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి చిన్నయ్య పురుషోత్తంరెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement