ప్రేమతో.. పెళ్లి కానుక

YSR Pelli kanuka Scheme Money Hikes CM YS Jagan Mohan Reddy - Sakshi

ప్రోత్సాహకం భారీగా పెంచినవైఎస్సార్‌సీపీ ప్రభుత్వం

వివాహానికి ముందు యువతి ఖాతాలో 20 శాతం జమ

తుమ్మపాల (అనకాపల్లి): తెల్లరేషన్‌ కార్డు గల పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వం అందించే  పెళ్లికానుక నగదును సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రెండింతలు పెంచారు. సాధారణంగా ఇల్లు, పెళ్లి అనేవి ప్రతి కుటంబంలో ఆర్థిక పరిస్థితులపై ప్రభావితం చేస్తాయి. వీటికోసం ఆస్తులైనా అమ్ముకోవాలి లేదంటే అప్పులైనా చేసి ఈ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ పరిస్థితులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం  వివాహం చేసుకునే యువతి కుటుంబానికి  వైఎస్సార్‌ పెళ్లికానుక పథకంలో ఆర్థికసాయం అందించి బాసటగా నిలుస్తోంది.   

అర్హత ఇలా..
తెల్లరేషన్‌ కార్డు గల కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. వివాహం చేసుకుంటున్న యువతీ, యువకుడు ఇద్దరు వారి వారి రేషన్‌ కార్డుల్లో పేర్లు కలిగి ఉండాలి.  ప్రజాసాధికార సర్వేలో కూడా నమోదై ఉండాలి. తొలిసారి వివాహం చేసుకుంటున్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు.  వితుంతువుకు రెండో దఫా కూడా అర్హత కలిగించారు. వివాహం చేసుకుంటున్న యువతి 18, యువకుడు 21 ఏళ్లు నిండి ఉండాలి. మండల పరిధిలో గల వెలుగు కార్యాలయాల్లో వివాహనికి 15 రోజులు మందుగానే ధరఖాస్తు చేసుకోవాలి. కనీస గడువులోగా  గ్రామపరిధిలోని కల్యాణమిత్రలు వచ్చి వివరాలు పరిశీలన చేస్తారు. అందించే ఆర్థికసాయంలో 20 శాతం మొత్తాన్ని వివాహనికి ముందు యువతి ఖతాలో జమ చేస్తారు. 

తెల్ల రేషన్‌కార్డు తప్పనిసరి
తెల్లరేషన్‌ కార్డు గల ప్రతి కుటుంబానికి వైఎస్సార్‌ పెళ్లికానుక పథకం వర్తిస్తుంది. గతంలో కన్నా అధికంగా రెట్టింపు ఆర్థిక సహాయాన్ని  ప్రభుత్వం అందిస్తుంది. వివాహ తేదీకి కనీసం 15 రోజులు ముందుగా వెలుగు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఆమోదం పొందితే వివాహానికి ముందు 20 శాతం సొమ్ము, తరువాత మిగిలిన సొమ్ము నేరుగా పెళ్లి కుమార్తె బ్యాంక్‌ ఖాతాలో జమ అవుతంది. ఈ ఏడాది 45 మంది పథకం ద్వారా లబ్ధి పొందారు.  – ఆర్‌.రామకృష్ణనాయుడు,  వెలుగు ఏపీఎం, అనకాపల్లి మండలం  

ఇవి తప్పనిసరి
1.లబ్ధిదారుల వయసు ధ్రువీకరణ పత్రం (టెన్త్‌ మార్కుల జాబితా)
2.ఆధార్‌ కార్డు
3.తెల్లరేషన్‌ కార్డు, పెళ్లి పత్రిక  
4.పెళ్లి కుమార్తె బ్యాంకు ఖాతా పుస్తకం
5.వివాహ రిజిస్ట్రేషన్‌ ధ్రువీకరణ పత్రం
6. రెండవ పెళ్లి చేసుకునే మహిళకు వితంతు పింఛను ఉంటే వాటి పత్రాలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top