విశాఖ జిల్లాలో 'వైఎస్సార్‌ కంటివెలుగు' ప్రారంభం | Sakshi
Sakshi News home page

విశాఖ జిల్లాలో 'వైఎస్సార్‌ కంటివెలుగు' ప్రారంభం

Published Thu, Oct 10 2019 1:57 PM

YSR Kanti Velugu Started In Visakhapatnam District - Sakshi

సాక్షి, విశాఖపట్నం: జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌ కంటివెలుగు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. గురువారం గాజువాక హైస్కూల్‌లో వైఎస్సార్ కంటి వెలుగు పథకాన్ని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్య నారాయణ మాట్లాడుతూ... వైఎస్సార్‌ కoటి వెలుగుకు మద్దతుగా తాను నేత్ర దానం చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి కంటి చూపు ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయమని అన్నారు. ప్రతిపక్షాలు ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం నోవాటెల్‌లో మీటింగ్‌లు నిర్వహిస్తే.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మాత్రం ప్రజల మధ్యే కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. గాజువాక  అగనంపుడిలో 800 కోట్ల వ్యయంతో స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుడతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ సత్య నారయణ, అనకాపల్లి ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబురావు, కరణం ధర్మశ్రీ, వీఎమ్మార్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ కన్వీనర్లు అక్కరమని విజయ నిర్మల, మళ్ళ విజయ ప్రసాద్, కోలా గురువులు, విశాఖ జిల్లా వైద్యాధికారి తిరుపతి రావు, జీవీఎంసీ కమిషనర్  సృజన, జాయింట్ కలెక్టర్‌ శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్‌

నర్సీపట్నం: నియోజకవర్గంలోని నర్సీపట్నం బాలికల పాఠశాలలో వైఎస్సార్ కంటివెలుగు పథకాన్ని ఎమ్మెల్యే పెట్ల ఉమ శంకర్ గణేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోవిందరావు పాల్గొన్నారు.  
వైఎస్సార్ కంటి వెలుగు పథక ప్రారంభ కార్యక్రమంలో ఏర్పాట్లు పేలవంగా ఉండటంతో.. స్థానిక ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ నిర్వాహకులపై  తన అసంతృప్తి వ్యక్తం చేశారు. 

చోడవరం: చోడవరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఘనంగా ప్రారంభించారు. కశింకోట మండలం తాళ్లపాలెంలో వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ప్రారంభించారు. 

Advertisement
Advertisement