వైఎస్‌ ఆశయసాధనే లక్ష్యం

YSR Jayanthi Birthday Celebration In Visakhapatnam - Sakshi

మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మన్యంలో వాడవాడలా ఆదివారం  ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు వితరణతో అంజలి ఘటించారు. పేదలకు దుప్పట్లు, యువకులకు వాలీబాల్‌ కిట్లు, రోగులకు పాలు, రొట్టెలు పంపిణీ చేశారు.

పాడేరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి మన్యానికి చేసిన మేలు మరువలేనిదని, ఆయన ఆశయసాధనే వైఎస్సార్‌సీపీ లక్ష్యమని పాడేరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి తెలిపారు. వైఎస్‌ రాజశేఖర రెడ్డి జయంతిని ఆదివారం పాడేరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  అంబేడ్కర్‌ సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ పతాకాన్ని ఆమె ఆవిష్కరించారు. అలాగే వైఎస్‌ విగ్రహానికి భాగ్యలక్ష్మితోపాటు మండల పార్టీ అధ్యక్షుడు కూడా సింహాచలం, వైఎస్సార్‌సీపీ నాయకులు కె.వి. సురేష్‌కుమార్, విశ్వ, డాక్టర్‌ నర్సింగరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం  కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలందరికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద గిరిజన కుటుంబాల జీవన ప్రమాణాల మెరుగుకు వైఎస్‌ ఎనలేని సేవలందించి,  చిరస్మరణీయుడుగా నిలిచారని కొనియాడారు. వైఎస్‌ స్పూర్తి తో ఆదివాసీల అభ్యున్నతికోసం వైఎస్సార్‌సీపీ  నిత్యం కృషి చేస్తుందనిన్నారు. అనంతరం ఆమె 25 మంది వృద్ధ మహిళలకు దుప్పట్లు, వివిధ గ్రామాలకు చెందిన యువక్రీడాకారులకు వాలీబాల్‌ కిట్లు పంపిణీ చేశారు.
 
మాజీ ఎంపీపీల ఘన నివాళి
పాడేరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి 69వ జయంతిని వైఎస్సార్‌సీపీ నా యకులు, కార్యకర్తలు వాడవాడలా ఘనంగా నిర్వహించారు. పాడేరులోని అంబేడ్కర్‌ సెం టర్‌లో ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి మండలంలోని లింగాపుట్టు గ్రామంలో ఉన్న వైఎస్‌ విగ్రహానికి మాజీ ఎంపీపీలు ఎం.వి.గంగరాజు, ఎస్వీవీ రమణమూర్తి, వండ్లాబు మత్స్యకొండం నాయుడు, అరకు  పార్లమెంట్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సతకా బుల్లిబాబు, సొల భం సర్పంచ్‌ ఐసరం హనుమంతరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సం దర్భంగా వారు వైఎస్సార్‌ సేవలను కొనియాడారు.  ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ నాయకుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, మండల మహిళా అధ్యక్షురాలు లకే రత్నాభాయి, గబ్బాడి శేఖర్‌  పాల్గొన్నారు.

ఆ వృక్ష ఛాయలో...
పాడేరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి రెండో సారి ముఖ్యమంత్రి అయిన తరువాత పాడేరు సందర్శించినప్పుడు నాటిన మొక్క వద్ద ఆయన చిత్రపటాన్ని ఉంచి పూలమాలలు వేసి మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు నివాళులు అర్పించారు.

 
రానున్నది రాజన్న రాజ్యం
చింతపల్లి:  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయత్వంలోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, జెడ్పీటీసీ సభ్యురాలు కంకిపాటి పద్మకుమారి అన్నారు. ఆది వారం ఆమె నివాసంలో దివంగత ముఖ్యమంతి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి పాతబస్‌స్టాండ్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేక్‌ కట్‌చేసి, దివంగత నేతకు ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం స్థానిక ఆస్పత్రిలో రోగులకు పాలు, రొట్టె పంపిణీ చేశారు.  అన్న సమారాధన నిర్వహించారు. బెన్నవరం పంచాయతీకి చెందిన సుమారు వంద మంది గిరిజనులు పార్టీలో చేరారు.  జి.మాడుగుల మాజీ ఎంపీపీ మత్స్యరాస వెంకటగంగరాజు, మం డల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు బోయిన సత్యనారాయణ, సర్పంచ్‌లు సుండ్రు నాగజ్యోతి, కొర్రా రఘునాథ్, మాజీ వైస్‌ ఎంపీపీ బూసరి కృష్ణారావు, అరుకు పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి బుల్లిబాబు, జీకే వీధి నాయకులు గొర్లె కోటేశ్వరరావు, అడపా విష్ణుమూర్తి, సీనియర్‌నాయకులు గోవర్ధన్‌గిరి, ఎంపీటీసీలు సోమరత్నం, ఈశ్వరి పాల్గొన్నారు.

జగన్‌తోనే పేదల సంక్షేమం
 జగన్‌మోహన్‌ రెడ్డి అధికారంలోకి వస్తేనే పేదలకు సంక్షేమ పథకాలు అందుతాయని ఆ పార్టీ అరుకు పార్లమెంట్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్‌ అన్నారు.  అంతర్లలోని చిన్న పిల్లల ఆశ్రమంలో వైఎస్‌ జయం తిని నిర్వహించారు.   పిల్లతో కేక్‌కట్‌ చేయించారు. స్వామి , కిట్లం గిరాంబాబు, మామిడిగోవింద్,రామారావు, రాంకీ,కిరణ్,మంజు, బాబి,వెంకటట్‌పాల్గొన్నారు.

కొయ్యూరు మండలంలో...
కొయ్యూరు:  రాజశేఖరరెడ్డికి  మండల ప్రజలు ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. మండల వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు గాడి సత్యనారాయణ, మండల యువజన సంఘం అధ్యక్షుడు జల్లి హుస్సేన్,మహిళా విభా గం అధ్యక్షురాలు జె.రాజులమ్మ,నేతలు  వారా నూకరాజు, లోకుల సోమాగాంధీ నల్లగొండలో రాజశేఖరరెడ్డి విగ్రహానికి  క్షీరాభిషేకం చేశారు.
   
జి.మాడుగులలో..
జి.మాడుగుల: దివంగత ముఖ్యమంత్రి,   రాజశేఖర్‌రెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని మాజీ ఎంపీపీ పాడేరు నియోజకవర్గం వైఎస్సార్‌ సీపీ నాయకులు మత్స్యరాస వెంకటగంగరాజు, న్యాయవాది ఎం విశ్వేశ్వరరాజు తెలిపారు. స్థానిక పంచాయతీ కార్యాలయ ఆవరణలో వెంకటగంగరాజు, గ్రంథాలయ ఆవరణ వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు కుడుమల సత్యనారాయణ, వైఎస్సార్‌టీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం మత్స్యరాజు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి  చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక పీహెచ్‌సీలోని రోగులకు పాలు, రొట్టెలు పంపిణీ చేశారు.  సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు ఐసరం హనుమంతరావు, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి సతక బుల్లిబాబు, వైఎస్సార్‌టీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.మత్స్యరాజు, మాజీ ఎంపీపీలు మత్స్యకొండం నాయుడు, ఎస్‌వి రమణమూర్తి, పాడేరు మండల మహిళా అధ్యక్షురాలు లకే రత్నమాంబ, వైఎస్సార్‌సీపీ నాయకులు బాలయ్యదొర, శేఖర్,సోమలింగం, రాంబాబు, బాబూరావు, పెదబంగా రాజు,నర్సిమూర్తి,రాజారావు, పండుబాబు, కొండబాబు, పాతుని రాములు, రామన్నదొర, మత్స్యకొండబాబు పాల్గొన్నారు.

 
జీకే వీధిలో..
గూడెంకొత్తవీధి:  వైఎస్సార్‌సీపీ శ్రేణులు వైఎస్‌ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.  వైఎస్సార్‌సీపీ మండల యూత్‌ ప్రెసిడెంట్‌ కుందరి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. జర్రెల ఎంపీటీసీ ఉగ్రంగి జగ్గమ్మ, బొబ్బిలి లక్ష్మణ్, జి.గోవిందరాజు, కె.ప్రసాద్, కె.శ్రీరాములు, ఉగ్రింగి ప్రసాద్, మండల మహిళ అధ్యక్షురాలు లింగేశ్వరమ్మ, సాగిన సత్తిబాబు పాల్గొన్నారు.  జర్రెల పంచాయతీ కేంద్రంలో సర్పంచ్‌ విజయకుమారి  పేద గిరిజ న మహిళలకు చీరలు, రోగులకు పాలు, రొట్టె పంపిణీ చేశారు.  వంచెల సర్పంచ్‌ కాంతమ్మ, విష్ణుమూర్తి, రాజేష్, చిన్నబ్బాయి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top