పులివెందుల సీఐపై సస్పెన్షన్‌ వేటు | ys vivekananda reddy murder case: Pulivendula CI Shankaraiah suspended | Sakshi
Sakshi News home page

పులివెందుల సీఐపై సస్పెన్షన్‌ వేటు

Mar 22 2019 8:28 AM | Updated on Mar 22 2019 8:39 AM

ys vivekananda reddy murder case: Pulivendula CI Shankaraiah suspended - Sakshi

సాక్షి, కడప : పులివెందుల సీఐ శంకరయ్యపై సస్పెన్షన్‌ వేటు పడింది. దివంగత వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించిన విధుల్లో నిర్లక్ష్యంగా వ‍్యవహరించారని ఆయనను జిల్లా ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మ సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా హత్య జరిగి  వారం రోజులు గడుస్తున్నా కేసు వ్యవహారం ఓ కొలిక్కిరాలేదు.. సరికదా నిందితులెవరన్నది వెల్లడికాలేదు. హత్య జరిగిన తీరు పరిశీలిస్తే కిరాయి హంతకులు చేసిన పనేనని స్పష్టమవుతున్నా అందుకు సూత్రధారులు, పాత్రధారులు ఎవ్వరన్న విషయం తెలియలేదు. మరోవైపు తన తండ్రి హత్యకేసును నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలంటూ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి నిన్న ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement