వైఎస్ హయాంలోనే పేదలకు లబ్ధి

పాలకుర్తి: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పేదలకు సంక్షేమ పథకాలు అందాయని టీడీపీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా పాలకుర్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తరువాత ప్రజలందరికీ మేలు చేస్తానని ప్రకటించిన కేసీఆర్... అధికారంలోకి వచ్చాక హామీలు విస్మరిస్తున్నారని విమర్శించారు. వైఎస్ హయాంలో అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందాయన్నారు. కాంగ్రెస్ ఎన్ని తప్పులు చేసినా, విద్యుత్ సమస్య లేకుండా చేసిందన్నారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ సమస్య ఉండదని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు.
మరిన్ని వార్తలు