ఐదు రోజు ముగిసిన ప్రజాసంకల్పయాత్ర | ys jagans day five PrajaSankalpaYatra ends | Sakshi
Sakshi News home page

ఐదు రోజు ముగిసిన ప్రజాసంకల్పయాత్ర

Nov 11 2017 8:50 PM | Updated on Jul 25 2018 4:09 PM

ys jagans day five PrajaSankalpaYatra ends - Sakshi

సాక్షి, ప్రొద్దుటూరు :  ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల‍్పయాత్ర ఐదో రోజు(శనివారం) ప్రొద్దుటూరు బైపాస్‌ రోడ్డు వద్ద ముగిసింది. పాదయాత్రలో భాగంగా పొట్లదుర్తి, ప్రొద్దుటూరు ప్రజలతో వైఎస్‌ జగన్‌ మమేకమయ్యారు. పరిసర గ్రామాలలో అభిమానులు, కార్యకర్తలు నీరాజనలు పలికారు. మహిళలు వైఎస్‌ జగన్‌కు రోడ్లపై పూలు చల్లి, హారతులు పడుతూ, కుంకుమలు పెట్టి తమ సోదరుడిల భావించి రక్షబంధనం కట్టి తాము వేసిన ముగ్గులతో స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు. ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్‌ వద్ద బహిరంగ సభ నిర్వహించారు.

శనివారం ఉదయం తొమ్మిది గంటలకు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పొట్లదుర్తి శివారు నుంచి ఐదో రోజు యాత్రను మొదలు పెట్టారు. ఆయన వెంట నడిచేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అక్కడి నుంచి ప్రొద్దుటూరు అయ్యప్ప గుడి మీదుగా పుట్టపర్తి సర్కిల్‌కు చేరుకున్నారు. ఐదో రోజు పాదయాత్ర అనంతరం సాయి శ్రీ వెంచర్‌(హౌసింగ్‌ బోర్డు) సమీపంలో రాత్రి బస చేస్తారు. ఇవాళ ఆయన 13 కిలోమీటర్ల మీద పాదయాత్ర చేశారు. ఇక ఆరోరోజు పాదయాత్రను వైఎస్‌ జగన్‌ సాయిశ్రీ నగర్‌ నుంచి ఆరంభించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement