పత్తికొండ నుంచి 24వ రోజు ప్రజాసంకల్పయాత్ర | YS jagan PrajaSankalpaYatra day 23 end | Sakshi
Sakshi News home page

పత్తికొండ నుంచి 24వ రోజు ప్రజాసంకల్పయాత్ర

Dec 1 2017 7:38 PM | Updated on Jul 25 2018 4:07 PM

YS jagan PrajaSankalpaYatra day 23 end - Sakshi

సాక్షి, కర్నూలు : ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 24వ రోజు ప్రజా సంకల్పయాత్ర షెడ్యూల్‌ ఖరారు అయింది. శనివారం ఆయన పత్తికొండ నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. రతన, తుగ్గలి, గిరిగట్ల మీదగా మదనంతపురం క్రాస్‌ వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది.

మరోవైపు 23వ రోజు ప్రజాసంకల్పయాత్రను వైఎస్‌ జగన్‌ పత్తికొండలో ముగించారు. ఇవాళ ఆయన 15.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. బిల్లేకల్‌, జుటురు, చిన్నహళ్తి మీదగా పత్తికొండ వరకూ యాత్ర సాగింది. ఇప్పటివరకూ వైఎస్‌ జగన్‌ 330.6 కిలోమీటర్లు నడిచారు.

Advertisement
 
Advertisement
Advertisement