`జగన్‌ ముఖ్యమంత్రై కేంద్రస్థాయిలో ఎదుగుతారు` | ys jagan mohan reddy will pay key role in national politics, says Adinarayana reddy | Sakshi
Sakshi News home page

`జగన్‌ ముఖ్యమంత్రై కేంద్రస్థాయిలో ఎదుగుతారు`

Dec 21 2013 7:06 PM | Updated on Jul 25 2018 4:07 PM

`జగన్‌ ముఖ్యమంత్రై కేంద్రస్థాయిలో ఎదుగుతారు` - Sakshi

`జగన్‌ ముఖ్యమంత్రై కేంద్రస్థాయిలో ఎదుగుతారు`

జగన్‌ ముఖ్యమంత్రై కేంద్రస్థాయిలో ఎదుగుతారని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరులో శనివారం సమైక్య శంఖారావం సభను ఏర్పాటు చేశారు.

వైఎస్సార్ జిల్లా:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రై కేంద్రస్థాయిలో ఎదుగుతారని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరులో శనివారం సమైక్య శంఖారావం సభను ఏర్పాటు చేశారు. ఈ శంఖారావం సభలో పాల్గొన్న ఆదినారాయణరెడ్డి,  జగన్ నాయకత్వంలో రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని చెప్పారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి కూడా ఈ సభలో పాల్గొన్నారు.

 

కాగా, రాష్ట్ర విభజన పాపం కిరణ్‌, చంద్రబాబులదేనని వైఎస్‌ అవినాష్‌రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాన్ని.. దేశవ్యాప్తంగా ఆలోచింప చేసిన వ్యక్తి ఒక్క జగన్‌ మాత్రమేనని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement