మిమ్మల్ని ఎలా కడుగుతానో చూపిస్తా... | ys jagan mohan reddy takes on chanrababu naidu in ap assembly | Sakshi
Sakshi News home page

మిమ్మల్ని ఎలా కడుగుతానో చూపిస్తా...

Mar 11 2015 12:53 PM | Updated on Aug 18 2018 8:54 PM

మిమ్మల్ని ఎలా కడుగుతానో చూపిస్తా... - Sakshi

మిమ్మల్ని ఎలా కడుగుతానో చూపిస్తా...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు బుధవారం వాడీవేడిగా జరిగాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వుద్దం జరిగింది.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు బుధవారం వాడీవేడిగా జరిగాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వుద్దం జరిగింది.  గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడకపోవటం ఇదే ప్రధమమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.  అయితే ఆయన వ్యాఖ్యలను ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు.  ఈ సందర్భంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని... గత అసెంబ్లీ సమావేశాల్లో సభలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు మాట్లాడేందుకు తాను మైక్ ఇవ్వటం లేదన్న చంద్రబాబు మాటలను గుర్తు చేశారు. దాని బట్టే బడ్జెట్ పై తాను ఎంత మాట్లాడానో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇక 2013 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అసలు సభలోనే లేరన్నారు.

అసెంబ్లీలో  ఏపీ బడ్జెట్ ప్రసంగంలో మిమ్మల్ని కడిగి పారేస్తా... కడిగించుకోండి అని వైఎస్ జగన్ అన్నారు.  ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వైఎస్ జగన్ ముందుగా అచ్చెన్నాయుడు మాట్లాడటం ఎలాగో నేర్చుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement