రంజాన్‌ నెల ప్రారంభం : వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు | YS Jagan Mohan Reddy Ramzan Wishes To Muslims | Sakshi
Sakshi News home page

రంజాన్‌ నెల ప్రారంభం : వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు

May 16 2018 9:37 PM | Updated on Oct 16 2018 6:01 PM

YS Jagan Mohan Reddy Ramzan Wishes To Muslims - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ మాసం ప్రారంభమైన సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజులపాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే ఈ పుణ్య పవిత్ర మాసాన్ని ముస్లిం సోదర సోదరీమణులంతా జరుపుకుంటారని, వారికి అల్లాహ్‌ దీవెనలు లభించాలని ఆయన ఆకాంక్షించారు.

మహనీయుడైన మహ్మద్‌ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్‌ ఆవిర్భవించినది రంజాన్‌ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తారని పేర్కొన్నారు. రంజాన్‌ అంటే ఉపవాస దీక్ష మాత్రమే కాదని, మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌ అని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement