జగ్జీవన్ రామ్ కు వైఎస్ఆర్‌ సీపీ ఘన నివాళి | ys jagan mohan reddy pays tribute to Babu Jagjivan Ram on death anniversary | Sakshi
Sakshi News home page

జగ్జీవన్ రామ్ కు వైఎస్ఆర్‌ సీపీ నివాళి

Jul 6 2017 11:33 AM | Updated on May 29 2018 4:40 PM

బాబూ జగ్జీవన్ రామ్ వర్థంతి సందర్భంగా ఆయనకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘనంగా నివాళులు అర్పించింది.



హైదరాబాద్‌ :  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌ రామ్‌ 31 వర్ధంతి సందర్భంగా  ఆయనకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘనంగా నివాళులు అర్పించింది. వైఎస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన జగ్జీవన్‌ రామ్‌ చిత్రపటానికి ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే ఆదిమూలపు రవికుమార్‌,పార్టీ అధికార ప్రతినిధి అరుణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement