జీసస్‌ మహాత్యాగానికి గుర్తు గుడ్‌ ఫ్రైడే : వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy greets on Good Friday | Sakshi
Sakshi News home page

జీసస్‌ మహాత్యాగానికి గుర్తు గుడ్‌ ఫ్రైడే : వైఎస్‌ జగన్‌

Apr 19 2019 1:07 PM | Updated on Apr 19 2019 3:51 PM

YS Jagan Mohan Reddy greets on Good Friday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరుణామయుడైన ఏసు ప్రభువును శిలువ వేసిన గుడ్‌ ఫ్రైడే రోజు, ఆ తరువాత ఆయన పునరుజ్జీవించిన ఈస్టర్‌ సండే రోజు.. ఈ రెండూ మానవాళి చరిత్రను మలుపులు తిప్పిన ఘట్టాలు అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జీసస్‌ మహాత్యాగానికి గుర్తు గుడ్‌ ఫ్రైడే అని తెలిపారు. మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధులు లేని త్యాగం.. ఇవి జీసస్‌ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశం అని జగన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు గుడ్‌ ఫ్రైడే శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement