
కృష్ణా, గుంటూరు నేతలతో వైఎస్ జగన్ భేటీ
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ నేతలతో సమావేశమయ్యారు
హైదరాబాద్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం కృష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జులై 8, 9 తేదీల్లో నిర్వహించే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్లీనరీపై వైఎస్ జగన్ చర్చించారు.
ఇప్పటికే అన్ని చోట్ల నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాలు పూర్తయిన నేపథ్యంలో త్వరలో జిల్లాస్థాయిలోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ప్లీనరీ సమావేశాల్లో ప్రజాసమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చలు జరగనున్నాయి. విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి ప్లీనరీ కమిటీలపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ చర్చించారు.