
సాక్షి, హైదరాబాద్ : ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఆరో రోజు షెడ్యూల్ విడుదల అయింది. ఆదివారం ఉదయం ఆయన ప్రొద్దుటూరు నియోజకవర్గం సాయిశ్రీ నగర్ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. ఆరోరోజు యాత్ర అమృతనగర్,చెన్నమ్మపేట, కమననూరు, రాధా నగర్ మీదగా నేలటూరు క్రాస్‌రోడ్డులో భోజన విరామం, ఎర్రబల్లి క్రాస్ రోడ్డు, దువ్వూరు మీదగా సాగుతుంది. అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దువ్వూరు జాతీయ రహదారి వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో వైఎస్ జగన్ బస చేస్తారు. కాగా అయిదోరోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన ఇవాళ (శనివారం) 13 కిలోమీటర్లు యాత్ర చేశారు.