అమ్మాయితో చాటింగ్.. చితకబాదిన బంధువులు | youth chats with girl on facebook, beaten | Sakshi
Sakshi News home page

అమ్మాయితో చాటింగ్.. చితకబాదిన బంధువులు

Jan 27 2015 12:47 PM | Updated on Jul 26 2018 12:31 PM

అమ్మాయితో చాటింగ్.. చితకబాదిన బంధువులు - Sakshi

అమ్మాయితో చాటింగ్.. చితకబాదిన బంధువులు

ఫేస్బుక్లో ఓ అమ్మాయితో చాటింగ్ చేసిన యువకుడిని ఆమె బంధువులుగా భావిస్తున్న కొందరు వ్యక్తులు చితక్కొట్టారు.

ఫేస్బుక్లో ఓ అమ్మాయితో చాటింగ్ చేసిన యువకుడిని ఆమె బంధువులుగా భావిస్తున్న కొందరు వ్యక్తులు చితక్కొట్టారు. కృష్ణాజిల్లా గొల్లపూడికి చెందిన శివదుర్గా శ్రీనివాస్, వారంరోజులుగా  ఫేస్బుక్లో ఓ యువతితో చాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ''ఈ రోజు కాలేజీ లేదు విజయవాడ క్లబ్ సమీపంలోని ఎడ్వంచర్ వద్ద కలుసుకుందామా '' అని అతడు చాటింగ్లో కోరాడు.

ఆమె ఓకే అంటూ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దాంతో అతడు ఎడ్వంచర్ ప్రాంతం వద్ద వేచి చూస్తుండగా.. అక్కడకు వచ్చిన కొంతమంది అగంతకులు అతడిని ఎత్తుకెళ్లి చితకబాది పొలంలోపడేసి పరారయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement