కోమటిలంక అమ్మాయి.. ఎదురుచూపు | Young Woman Waiting For Relatives in Rescue Home | Sakshi
Sakshi News home page

కోమటిలంక అమ్మాయి.. బంధువుల కోసం ఎదురుచూపు

Dec 7 2018 1:08 PM | Updated on Dec 7 2018 1:14 PM

Young Woman Waiting For Relatives in Rescue Home - Sakshi

కృష్ణాజిల్లా, ఏలూరు టౌన్‌ : కృష్ణాజిల్లా కైకలూరు మండలం కోమటిలంక గ్రామానికి చెందిన బలే నాగజ్యోతి 12 ఏళ్ల క్రితం ఇంటి నుంచి దూరమైంది. జ్యోతి తల్లి గంగ ఆమె చిన్నతనంలోనే చనిపోగా తండ్రి గోకణేషు 2006లో మృతి చెందాడు. జ్యోతికి ఒక అక్క ఉంది. వాళ్ల మేనత్త ఇద్దరినీ తాడేపల్లిగూడెం తీసుకెళ్లింది. వారిని పెంటపాడులోని సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో చేర్పించింది. అయితే, నాగజ్యోతి అక్కడ ఉండేందుకు ఇష్టపడకుండా సొంతూరు వెళ్లింది.

ఆమె బంధువులు మేనత్త వద్దే ఉండాలని చెప్పటంతో జ్యోతికి ఇష్టం లేక చెన్నై వెళ్లే రైలు ఎక్కేసి అక్కడకు చేరింది. కొంతకాలం చెన్నైలోని చైల్డ్‌లైన్‌లో ఉంది. జ్యోతి వివరాలు తెలుసుకుని ఆమెను ఏలూరు పంపారు. ప్రస్తుతం ఏలూరు హోంలో వసతి పొందుతోంది. జ్యోతి ఇంట్లో నుంచి బయటకు వచ్చేనాటికి (2006, డిసెంబర్‌) ఆమెకు పదేళ్ల వయస్సు కావటంతో వారి బంధువుల పేర్లు, అడ్రస్‌ సరిగా చెప్పలేకపోతోంది. ఆమె తన బంధువులను కలుసుకునేందుకు ఎదురుచూస్తోంది. బంధువులు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని ఏలూరు మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై డి.గంగాభవానీ కోరుతున్నారు. వివరాలకు 91000 45424, 94906 95885 లో సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement