విశాఖ చేరుకున్న వైఎస్ జగన్ | y s Jagan Mohan Reddy arrives to visakapatnam | Sakshi
Sakshi News home page

విశాఖ చేరుకున్న వైఎస్ జగన్

Dec 5 2014 8:14 AM | Updated on Aug 17 2018 8:19 PM

విశాఖ చేరుకున్న వైఎస్ జగన్ - Sakshi

విశాఖ చేరుకున్న వైఎస్ జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం విశాఖపట్నం వెళ్లారు.

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం విశాఖపట్నం వెళ్లారు. హైదరాబాద్ నుంచి బయల్దేరి విశాఖ చేరుకున్నారు. టీడీపీ ప్రభుత్వం మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు చేపడుతున్న మహాధర్నాలో వైఎస్ జగన్ పాల్గొంటారు.

ఉదయం 10గంటలకు ధర్నా నిర్వహించే కలెక్టరేట్‌కు వైఎస్ జగన్ చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటవరకు ధర్నా నిర్వహిస్తారు. అనంతరం వై.ఎస్.జగన్ సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. పార్టీ నేతలతో కొంతసేపు సమావేశమయ్యాక సాయంత్రం 5గంటలకు హైదరాబాద్ వెళతారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఈ రోజు వైఎస్ఆర్ సీపీ ధర్నాలు చేపడుతున్న సంగతి తెలిసిందే.


 

Advertisement
 
Advertisement
Advertisement