హైదరాబాద్ యూటీ చేస్తామంటే అంగీకరించం: టీ కాంగ్రెస్ నేతలు | Won't accept hyderabad as union territory, say t-congress leaders | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ యూటీ చేస్తామంటే అంగీకరించం: టీ కాంగ్రెస్ నేతలు

Aug 27 2013 9:16 PM | Updated on Sep 1 2017 10:10 PM

హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తామంటే అంగీకరించేది లేదని టీ-కాంగ్రెస్ నేతలు ఆంటోనీ కమిటీకి స్పష్టం చేశారు.

సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు వెళ్లి ఆంటోనీ కమిటీకి తమ వాణిని గట్టిగా వినిపిస్తుండటంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో గుబులు మొదలైంది. ప్రత్యేక రాష్ట్రం దాదాపుగా వచ్చేస్తోందనుకుంటున్న తరుణంలో ఇలా జరుగుతోందేంటని.. వెంటనే హస్తిన బయల్దేరి వెళ్లి ఆంటోనీ కమిటీని కలిసొచ్చారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తామంటే అంగీకరించేది లేదని వారు ఆంటోనీ కమిటీకి స్పష్టం చేశారు.

సమైక్యరాష్ట్రం ఉండగానే సీమాంధ్రులపై హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయంటూ సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి వాళ్లే తమను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని టీ కాంగ్రెస్ నేతలు కమిటీకి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని రక్షణ మంత్రి ఆంటోనీకి టి.కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement