సంతానం లేదని వివాహిత ఆత్మహత్య  | Women Suicide In Parigi Anantapur District | Sakshi
Sakshi News home page

సంతానం లేదని వివాహిత ఆత్మహత్య 

Apr 23 2018 7:47 AM | Updated on Jun 1 2018 8:45 PM

Women Suicide In  Parigi Anantapur District - Sakshi

చంద్రకళ మృతదేహం

పరిగి : సంతాన భాగ్యానికి నోచుకోలేకపోయానని మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని బిందూనగర్‌కు చెందిన గాజుల వ్యాపారి నాగబూషణకు కర్ణాటక రాష్ట్రం దొమ్మతమర్రికి చెందిన చంద్రకళ(27)తో పదేళ్ల క్రితం వివాహమైంది. ఇన్నేళ్లయినా వీరికి సంతానం కలగలేదు. చివరకు టెస్ట్‌ట్యూబ్‌ బేబీ కోసం ప్రయత్నం చేశారు. వైద్యపరీక్షల్లో గర్భసంచి దెబ్బతినిందని తేలింది. పిల్లలు కలిగే అవకాశం లేదని వైద్యులు స్పష్టం చేశారు.

మానసికంగా కుమిలిపోయిన చంద్రకళ శనివారం సాయంత్రం భర్త లేని సమయంలో పైకప్పు ఇనుపతీరుకు చీరతో ఉరివేసుకుంది. కొద్దిసేపటి తర్వాత ఇంటికొచ్చిన భర్త గమనించి ఇరుగుపొరుగు సాయంతో ఆమెను కిందకు దింపి హిందూపురం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆదివారం ఉదయం సమాచారం అందడంతో పోలీసులు గ్రామానికెళ్లి ఆరా తీశారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని హెడ్‌కానిస్టేబుల్‌ షర్ఫుద్దీన్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement