రుణ మాఫీ చేయకుండా ప్రభుత్వం జాప్యం చేయడంతో మహిళా సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు.
రాజమండ్రి(పిఠాపురం): రుణ మాఫీ చేయకుండా ప్రభుత్వం జాప్యం చేయడంతో మహిళా సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలో మంగళవారం ఈ సమావేశం జరిగింది. డ్వాక్రా మహిళలకు రూ. 10వేలు ఇస్తామని చెప్పి రూ. 3వేలు ఇవ్వడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ప్రభుత్వం డ్యాక్రా రుణాల మాఫీపై అనుసరిస్తున్న విధానాలుకు వ్యతిరేకంగా 30 మహిళా సంఘాలు గొల్లప్రోలు మండలం చేబ్రోలు సమావేశమై తీర్మానం చేశాయి. ఎలాంటి నిబంధనలు లేకుండా డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు.