పీఎస్ ఎదుట మహిళ ధర్నా | Woman stages dharna infront of police station | Sakshi
Sakshi News home page

పీఎస్ ఎదుట మహిళ ధర్నా

Mar 14 2016 2:51 PM | Updated on Aug 21 2018 9:20 PM

అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేయలేదంటూ ఓ మహిళ ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టింది.

ఏలేశ్వరం (తూర్పు గోదావరి జిల్లా) :  అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేయలేదంటూ ఓ మహిళ ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టింది. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. అతణ్ణి అరెస్ట్ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ పురుగులమందు డబ్బా పట్టుకుని స్టేషన్ ఎదుట ధర్నాకు దిగింది. నిందితుడు కళ్ల ముందే తిరుగుతున్నా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వెనుకడుగు వేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement