పిడుగుపాటుకు మహిళ మృతి | woman died of fallen the Thunderbolt | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు మహిళ మృతి

Feb 20 2015 9:38 PM | Updated on Sep 2 2017 9:38 PM

విజయనగరం జిల్లా మక్కువ మండలంలోని బోడెవలస గ్రామంలో పిడుగు పడటంతో వెంకటబైరిపురం గ్రామానికి చెందిన వెలమల పార్వతి(40) అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందింది.

విజయనగరం: విజయనగరం జిల్లా మక్కువ మండలంలోని బోడెవలస గ్రామంలో పిడుగు పడటంతో  వెంకటబైరిపురం గ్రామానికి చెందిన వెలమల పార్వతి(40) అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. వివరాలు...పార్వతి కట్టెలకోసం బోడెవలస గ్రామ సమీపాన కొండ దగ్గరకి వచ్చింది. ఆ సమయంలోనే ఈదురు గాలులు వీయటంతో పక్కనే ఉన్న పాకలోకి చేరుకుంది. రవిప్రసాద్ అనే వ్యక్తి కూడా వర్షం మొదలవటంతో పాకలోకి చేరుకున్నాడు. ఒక్కసారిగా దభేలున పిడుగు పడటంతో పార్వతి మృతి చెందింది. రవిప్రసాద్ అపస్మారకస్థితిలో ఉండటంతో ఆసుపత్రిలో చేర్చారు.
(మక్కువ)

Advertisement
 
Advertisement
Advertisement