ఆర్టీసీని కాపాడే దారేది? | who saved in rtc | Sakshi
Sakshi News home page

ఆర్టీసీని కాపాడే దారేది?

Sep 8 2014 12:02 AM | Updated on Sep 2 2017 1:01 PM

ఆర్టీసీని కాపాడే దారేది?

ఆర్టీసీని కాపాడే దారేది?

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం కచ్చితమైన చర్యలు తీసుకునేవరకూ పోరాటం చేయాలని ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) నిర్ణయించింది.

11 నుంచి సమ్మెపై వెనక్కు తగ్గేది లేదు: ఈయూ
 
విజయవాడ బ్యూరో: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం కచ్చితమైన చర్యలు తీసుకునేవరకూ పోరాటం చేయాలని ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) నిర్ణయించింది. ఈనెల 11వతేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమైన నేపథ్యంలో ఈయూ ఆధ్వర్యంలో ఆదివారం అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్, సీపీఐ, సీపీఎం ప్రతినిధులు, వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ నేతలు దీనికి హాజరయ్యూరు. ఆర్టీసీ మనుగడ కోసం చేస్తున్న ఈ ఆందోళనకు అన్ని పార్టీలు, కార్మిక సంఘాలు బాసటగా నిలవాలని ఈయూ నేతలు విజ్ఞప్తి చేశారు. గతంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించిన ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు సంస్థను నిలబెట్టుకునేందుకు ఉద్యమ బాట పడుతున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీకి రూ.250 కోట్లు ఇస్తానని ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ై మూడు రోజులపాటు నిరవధిక దీక్షలు చేపట్టినా ప్రభుత్వం, యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తక్షణం బకారుులు చెల్లించాలి

ఆర్టీసీ చట్టం 1950 ప్రకారం 1: 2 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1995-96 తరువాత విస్మరించాయని ఈయూ నేతలు పేర్కొన్నారు. వివిధ సంక్షేమ పథకాల కింద కార్మికులు దాచుకున్న రూ.444 కోట్లను యాజమాన్యం ఖర్చు చేసిందని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రూ.700 కోట్లు రావాల్సి ఉందన్నారు.బకారుుల విడుదల, ప్రైవేటీకరణను విరమించుకోవాలని, సీసీఎస్ సొమ్మును యాజమాన్యం నుంచి రికవరీ చేయాలనే 8 డిమాండ్లతో రౌండ్ టేబుల్ భేటీల్లో తీర్మానాలు చేశారు.         
 
కార్మికులతో 9న యూజమాన్యం చర్చలు

హైదరాబాద్: సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈనెల 9వ తేదీన ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు కార్మిక సంఘాల నాయకులను పిలిచారు. ఇప్పటికే ఒకసారి మంత్రి సిద్ధా రాఘవరావు వారితో చర్చలు జరిపినా ఎలాంటి పురోగతి లేదు. ఈ నేపథ్యంలో మరోసారి చర్చలకు వివిధ యూనియన్ల నాయకులను ఆహ్వానించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement