ఆలయాలను పరిరక్షిద్దాం-గజల్ శ్రీనివాస్ | 'we must secure the temples' | Sakshi
Sakshi News home page

ఆలయాలను పరిరక్షిద్దాం-గజల్ శ్రీనివాస్

Feb 9 2015 5:53 PM | Updated on Sep 15 2018 8:43 PM

దర్శనం చేసుకుంటున్న గజల్ శ్రీనివాస్. - Sakshi

దర్శనం చేసుకుంటున్న గజల్ శ్రీనివాస్.

ఆలయాలను పరిరక్షణకు ప్రజలందరి సహకారం కావాలని ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు.


విజయనగరం టౌన్: ఆలయాలను పరిరక్షణకు ప్రజలందరి సహకారం కావాలని ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం విజయనగరం సంతపేటలోని జగన్నాథస్వామి ఆలయాన్ని సందర్శించుకున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.సేవ్ టెంపుల్ ఆర్గనైజేషన్ తరఫున ఆలయ ఆధునీకరణకు రూ. లక్ష అందిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫేస్‌బుక్‌లో ప్రత్యేక పేజీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సేవ్ టెంపుల్ ఆర్గనైజేషన్ కన్వీనర్ అయిన ఆయన ప్రవాసాంద్రులను సమావేశపరిచి సంస్థ తరపున దేవాలయాల పరిరక్షణకు వారితో కలిసి కృషి చేస్తానని హామినిచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement