‘వాక్‌ విత్‌ జగనన్న’కు సన్నద్ధం | Walk With Jagan @ 1000KM Of Praja Sankalpa Padayatra | Sakshi
Sakshi News home page

‘వాక్‌ విత్‌ జగనన్న’కు సన్నద్ధం

Jan 28 2018 9:23 AM | Updated on Jul 6 2018 2:54 PM

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహా సంకల్పం పాదయాత్ర 1000 కిలోమీటర్లకు చేరుకుంటున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో పార్టీ శ్రేణులు ‘వాక్‌ విత్‌ జగనన్న’ పేరుతో పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. జగన్‌ యాత్రకు సంఘీభావంగా సోమవారం జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి మంగమూరురోడ్డు, లాయరుపేట, వీఐపీ రోడ్డు, కోర్టు సెంటర్ల మీదుగా ప్రకాశం భవనం వద్దనున్న వైఎస్సార్‌ విగ్రహం వరకు పాదయాత్ర జరగనుంది. ఈ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా పాల్గొననున్నారు. ఈ యాత్ర కోసం పార్టీ శ్రేణులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.  

పాదయాత్ర ఘనంగా నిర్వహించనున్నట్లు పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు తదితరులు శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.   అదే రోజు జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని 12 నియోజకవర్గాల పరిధిలో వాక్‌ విత్‌ జగనన్న పేరుతో పాదయాత్రలు జరగనున్నాయి. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల నేతలు ఏర్పాట్లు సిద్ధం చేశా రు. ఫిబ్రవరి మాసం మధ్య కల్లా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయా త్ర జిల్లాలో అడుగుపెట్టనుంది. దీంతో ఇప్పటికే పా ర్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. జగన్‌ యాత్రతో జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలను వచ్చే ఎన్నికలకు సమాయత్తం చేసేం దుకు జగన్‌ యాత్ర మరింత ఉపయోగపడుతుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement