అనుమానాస్పద మృతిగా భావిస్తున్నాం: విజయసాయి రెడ్డి

Vijaya Sai Reddy on Suspicious Death of YS Vivekananda Reddy  - Sakshi

లోతైన దర్యాప్తు జరపాలని డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌ : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హఠాన్మరణాన్ని అనుమానాస్పద మృతిగా భావిస్తున్నామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుండెపోటుతో మరణించారని సమాచారం అందిందని, కానీ పరిసరాలు  చూస్తే వివేకానంద రెడ్డి మృతిపై అనుమానం కలుగుతుందన్నారు. ఇది సహజ మరణమా? లేక ఎవరైనా ఉన్నారా? అనేది లోతైన దర్యాప్తు ద్వారా తేల్చాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున డిమాండ్‌ చేస్తున్నామన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కారులో బయలుదేరి అంత్యక్రియల్లో పాల్గొంటారు. అక్కడి పరిస్థితి తమందరికి తెలియదని, అందిన సమాచారం ప్రకారం అనుమానస్పద మృతి అనుకుంటున్నామన్నారు. పోస్ట్‌మార్టం పూర్తయ్యాకే ఎలాంటి మృతనేది తెలుస్తుందన్నారు. వివేకానంద మృతి చెందిన సందర్భాల్లో రాజకీయాలు మాట్లాడటం సరికాదన్నారు. అంత్యక్రియలు.. ఈ రోజు లేదా రేపు జరిగే అవకాశం ఉందన్నారు.

ఇప్పటికే వైఎస్‌ వివేకానంద రెడ్డి హఠాన్మరణంపై ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తలపై గాయం ఉండటం.. చనిపోయిన సమయంలో వివేకానంద రెడ్డి ఒంటరిగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను ప్రారంభించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top