వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో సామాన్య భ క్తులకే అధిక ప్రాధాన్యం ఇస్తూ శ్రీవారి దర్శన భాగ్యం కల్పించామని టీటీడీ ఈవో సాంబశివరావు చెప్పారు.
సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో సామాన్య భ క్తులకే అధిక ప్రాధాన్యం ఇస్తూ శ్రీవారి దర్శన భాగ్యం కల్పించామని టీటీడీ ఈవో సాంబశివరావు చెప్పారు. తిరుమలలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.ఎన్నడూ లేనివిధంగా ఏకాదశి దర్శనంలో వీఐపీ టికెట్లను 2,474కు పరిమితం చేసి, గంటన్నరలోపే వారికి దర్శనం పూర్తి చేశామన్నారు. తర్వాత 78,003 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించామన్నారు. ద్వాదశి రోజు 85,077 మంది భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారని చెప్పారు. టీటీడీ చరిత్రలో ఇది రికార్డని తెలిపారు.