సమైక్యాంధ్ర కోసం ఈరోజు సీమాంధ్రలో పలు చోట్ల ఉద్యమకారులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు.
విజయవాడ: సమైక్యాంధ్ర కోసం ఈరోజు సీమాంధ్రలో పలు చోట్ల ఉద్యమకారులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కృష్ణా జిల్లా పెడనలో సమైక్యాధ్ర కోసం వైఎస్‌ఆర్‌సీపీ నేత ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష 4 వ రోజుకు చేరింది. సమైక్యాంధ్రకు మద్దతుగా మైలవరంలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో సమైక్యాంధ్రకు మద్ధతుగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో దేవిచౌక్ వద్ద సమైక్యవాదులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా ఉండీలో సమైక్యాంధ్ర జెఎసి ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నేతలు సర్రాజు, వెంకటేశ్వరరాజు, రమేష్‌రాజు పాల్గొన్నారు.
అనంతపురంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విద్యార్ధుల ర్యాలీ నిర్వహించారు. అధ్యాపకులు రిలే నిరాహర దీక్షలో పాల్గొన్నారు.