వైఎస్సార్ సీపీ శ్రేణులు సమరోత్సాహంతో కదం తొక్కుతున్నారు. పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జిల్లాలో నెల రోజులుగా సడలని సంకల్పంతో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సమైక్య దీక్షలు చేపట్టారు.
సాక్షి, కడప : వైఎస్సార్ సీపీ శ్రేణులు సమరోత్సాహంతో కదం తొక్కుతున్నారు. పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు జిల్లాలో నెల రోజులుగా సడలని సంకల్పంతో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సమైక్య దీక్షలు చేపట్టారు. సమ్మె విరమించినా ఉద్యోగులు, ఎన్జీఓలు ఏదో ఒక రూపంలో ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. వీరికి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు సైతం ఊతంగా నిలుస్తున్నారు.
రాజంపేటలో జీసెస్ ఇన్‌ఫ్యాంట్ స్కూలు విద్యార్థులు ర్యాలీ నిర్వహించి పాత బస్టాండులో మానవహారంగా ఏర్పడ్డారు. ఉద్యోగ జేఏసీ నాయకులు ఎస్వీ రమణ నేతృత్వంలో ఎన్జీఓ హోం నుంచి కొత్త బస్టాండు వరకు ర్యాలీ నిర్వహించారు.
జమ్మలమడుగులో వైఎస్సార్ సీపీ నేతలు, పూల వ్యాపారులు మహబూబ్ హుసేన్, అబ్దుల్ ఆధ్వర్యంలో 309 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
రాయచోటిలో శిబ్యాల, చెన్నముక్కపల్లె, దిగువ అబ్బవరం, పెమ్మాడపల్లె గ్రామాలకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
పులివెందులలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు 20 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
రైల్వేకోడూరులో 32మంది వైఎస్‌ఆర్ సీపీ కార్యకర్తలు రిలే దీక్షలో పాల్గొన్నారు.
కమలాపురంలో విభరాపురం సింగిల్‌విండో వైస్ ప్రెసిడెంట్ సూర్యప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు దీక్షల్లో పాల్గొన్నారు.
బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్లలో కలసపాడు మండలం ముద్దంవారిపల్లె, అక్కుసిద్దుపల్లె గ్రామాలకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అంకన గురివిరెడ్డి నేతృత్వంలో 20 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. బద్వేలులో అరవింద విద్యాలయం స్కూలు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడ్డారు.
కడపలో నియోజకవర్గ సమన్యయకర్త ఎస్‌బి అంజాద్‌బాష నేతృత్వంలో 15 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. న్యాయవాదులు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దీక్షలు సాగాయి.
మైదుకూరులో ఉపాధ్యాయుల దీక్షలు కొనసాగాయి.