హాకీ క్రీడాకారిణిని వేధించిన యువకుల అరెస్టు | Two youths arrested for eve-teasing a hockey player | Sakshi
Sakshi News home page

హాకీ క్రీడాకారిణిని వేధించిన యువకుల అరెస్టు

Aug 20 2013 3:40 PM | Updated on Aug 25 2018 5:29 PM

ఓ మహిళా క్రీడాకారిణిపై ఇద్దరు యువకులు ఈవ్ టీజింగ్ పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్: మానవ మృగాలు ఏదో చోట మహిళలను వేధిస్తునే ఉన్నారు. ఎన్ని చట్టాలు తెచ్చి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా వారు మాత్రం తమ తీరును మాత్రం మార్చుకోవడం లేదు. ఓ హాకీ క్రీడాకారిణిపై ఇద్దరు యువకులు ఈవ్ టీజింగ్ పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రానికి చెందిన ఓ హాకీ క్రీడాకారిణి సోమవారం ముజాఫ్ నగర్ ఎస్‌ఎస్‌పీ ఆఫీసుకు ఆమె తండ్రితో కలసి వెళుతుండగా వికాస్(26), హరి ఓం(25) అనే ఇద్దరు యువకులు ఈవ్ టీజింగ్ పాల్పడ్డారు. ఇది గమనించిన స్థానికులు ఆ యువకులికి దేహ శుద్ధి చేసి  పోలీసులకు అప్పగించారు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ యువకుల్ని అరెస్టు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement