కారు ఢీకొని తోడికోడళ్లు మృతి | Two died and One injured in Road accident | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని తోడికోడళ్లు మృతి

Apr 21 2016 8:12 PM | Updated on Aug 30 2018 4:07 PM

ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామం శివారులో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో తోడికోడళ్లు మృతిచెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

ఏలేశ్వరం (తూర్పుగోదావరి జిల్లా) : ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామం శివారులో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డుప్రమాదంలో తోడికోడళ్లు మృతిచెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రత్తిపాడు మండలం బమ్మంగి గ్రామానికి చెందిన అర్జున, ఆయన భార్య లక్ష్మి, ఆమె తోడికోడలు భవాని, ఆమె కుమారుడు జగన్‌కుమార్ ద్విచక్రవాహనంపై జగ్గంపేటకు వెళుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్ష్మి, భవాని, జగన్‌ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని కాకినాడ ఆస్పత్రికి తరలించగా లక్ష్మి, భవానిలు మృతిచెందారు. జగన్‌ కుమార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement