కనగానపల్లి మండలం తూముచెర్ల గ్రామ శివారులో ఇంకుడుగుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు.
కనగానపల్లి (అనంతపురం జిల్లా) : కనగానపల్లి మండలం తూముచెర్ల గ్రామ శివారులో ఇంకుడుగుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది. తూముచెర్ల గ్రామానికి చెందిన మల్లేశ్, నిర్మల దంపతులు వ్యవసాయ కూలీలుగా పలిచేస్తున్నారు. సోమవారం ఉదయం యధావిధిగా ఇద్దరు పిల్లలు తేజ(9), తరుణ్(7)లను తీసుకుని కూలిపనులకు వెళ్లారు.
దంపతులిద్దరూ పొలంలో పనిచేసుకుంటుండగా పిల్లలు ఆడుకుంటూ పక్కనే ఉన్న ఇంకుడుగుంతలో పడిపోయారు. పిల్లల అరుపులు విని వెళ్లేలోగానే వారిద్దరూ నీటిలో మునిగి చనిపోయారు. ఇద్దరు పిల్లలు కళ్లముందే మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.