విశాఖలో ట్విన్‌ టవర్స్‌! | Twin Towers in Visakhapatnam! | Sakshi
Sakshi News home page

విశాఖలో ట్విన్‌ టవర్స్‌!

Jan 18 2017 1:49 AM | Updated on Nov 9 2018 5:56 PM

న్యూయార్క్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ తరహాలోనే విశాఖలో ట్విన్‌ టవర్స్‌ నిర్మించేందుకు ప్రణాళికలు

సాక్షి, విశాఖపట్నం: న్యూయార్క్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ తరహాలోనే విశాఖలో ట్విన్‌ టవర్స్‌ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ టక్కర్‌ పేర్కొన్నారు. నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దేశంలోనే అత్యంత ఎత్తయిన టవర్స్‌ నిర్మించనున్నట్టు చెప్పారు.

ఇప్పటికే వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ సీఈవోతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోందన్నారు. ఇందులో ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ను కూడా నిర్మించాలని నిర్ణయించామన్నారు. ఆర్థిక నగరాల ఏర్పాటు, ఐటీ రంగాభివృద్ధిపై మంగళవారం విశాఖలో రియల్‌ ఎస్టేట్‌ బిల్డర్స్, ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement