శ్రీవారి తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు బ్రహ్మాండనాయకుని జలవిహారం వేడుకగా జరిగింది.
తిరుపతి: శ్రీవారి తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు బ్రహ్మాండనాయకుని జలవిహారం వేడుకగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి మూడుమార్లు పుష్కరిణిలో ప్రదక్షిణగా విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. తెప్పపై ఉత్సవమూర్తుల వైభవాన్ని తిలకిస్తూ భక్తులు పులకించిపోయారు.