రెండు లారీలు ఢీకొనడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
చిత్తూరు(శ్రీకాళహస్తి): రెండు లారీలు ఢీకొనడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని బైపాస్ రోడ్డులో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు... చిత్తూరు నుంచి టమటా లోడ్‌తో వస్తున్న లారీని మరో లారీ ఢీకొంది. దీంతో లోడ్‌తో ఉన్న లారీ బోల్తా కొట్టడంతో బైపాస్‌పై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పింది. సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు.