కమిషనర్‌ను కలిసిన ట్రాఫిక్ హోంగార్డులు | Traffic Commissioner's meeting hongardus | Sakshi
Sakshi News home page

కమిషనర్‌ను కలిసిన ట్రాఫిక్ హోంగార్డులు

Oct 2 2013 1:35 AM | Updated on Sep 1 2017 11:14 PM

దూరప్రాంతాల బదిలీలను నిలిపివేయాలంటూ ట్రా ఫిక్ హోంగార్డులు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌ను కలి శారు.

సాక్షి,సిటీబ్యూరో: దూరప్రాంతాల బదిలీలను నిలిపివేయాలంటూ ట్రా ఫిక్ హోంగార్డులు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌ను కలి శారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 11 ట్రాఫిక్ పోలీసుస్టేషన్లలో పనిచేస్తున్న సుమారు 200మంది హోంగార్డులను ఇటీవలే కమిషనర్ బదిలీచేశారు. అయితే సైబరాబాద్ పరిధి వందకిలోమీటర్ల వరకు విస్తరించి ఉండడంతో హోంగార్డులు ఈ బదిలీలపై ఆవేదన చెందుతున్నారు. వచ్చే జీతం(రూ.6000)లో సుదూరప్రాంతంలో డ్యూటీకెళ్లి రావ డం ఇబ్బందికరమని కమిషనర్‌కు వివరించారు. సమస్యలు ఉన్న ఆయ న అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీఇచ్చారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement