
నేడు వైఎస్‌ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
వైఎస్ జగన్ అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ సమావేశం నేడు జరగనుంది.
హైదరాబాద్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం జరగనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ ఎంపీలందరూ హాజరవుతారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించే విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశగా చర్చలు జరపనున్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్ సీపీ పోరాడుతున్న సంగతి తెలిసిందే.