నో'టమాట' లేదు.. | Tomato Crop Farmers Loss in This Rainy Season | Sakshi
Sakshi News home page

నో'టమాట' లేదు..

Sep 17 2019 12:56 PM | Updated on Sep 17 2019 12:58 PM

Tomato Crop Farmers Loss in This Rainy Season - Sakshi

చిన్నమండెం మండల పరిధిలో ధరలు లేకపోవడంతో తోటలోనే మాగుతున్న టమాట కాయలు

పంటను చిత్తూరు జిల్లాలోని గుర్రంకొండ మార్కెట్‌కు తరలిస్తే అక్కడ కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. 10 బాక్సులకు ఒక బాక్సును జాక్‌పాట్‌ పేరుతో ఉచితంగా ఇవ్వాల్సి వస్తుంది. వంద బాక్సు కాయలలో 10 బాక్సులు ఇలాగే ఇస్తున్నాం. దీంతో పాటు వందకు రూ.10 కమీషన్ల రూపంలో ఇవ్వాలి.  కూలీలు, రవాణా, హమాలీల రూపంలో 30 రూపాయలు పోతోంది. రూ. 40 నుంచి రూ. 50 ఇలా ఖర్చు రూపంలోనే కష్టం కరిగిపోతోంది. రెండేళ్లుగా అనుకూలమైన ధరలు రావడం లేదు. రెండు నెలల కిందట పలికిన ధరలు చూసి మోసమోయాను. – ఆనంద్‌..కేశాపురం..చిన్నమండెం మండలం  

రాయచోటి : మార్కెట్‌లో ధర బాగుంటే దిగుబడి ఉండదు..దిగుబడి బాగుంటే ధర పలకదు..ఏటా టమాట రైతుకు ఎదరవుతున్న చేదు అనుభవమిది. ధర పలుకుతోంది కదా అని సాగు చే?స్తే సరకు మార్కెట్‌ చేరేరోగా రేటు పడిపోతోంది. దీంతో రైతుకు నో‘టమాట’ రావడం లేదు. ధర చూసి కుదేలవుతున్నాడు. తాజాగా అదే పరిస్థితి ఏర్పడింది. దీంతో టమాట రైతులు నష్టాల మూట నెత్తికెత్తుకోవల్సి వస్తోంది. మోత కూలీ కూడా రావడం లె?దని లబోదిబోమంటున్నాడు. సంబేపల్లె, చిన్నమండెం, మైదుకూరు, దువ్వూరు తదితర ప్రాంతాల్లో ఏ రైతును కదిలించినా కష్టాలే చెప్పుకొస్తున్నారు.  నెల రోజుల కిందట టమాట కిలో రూ.80 పలికింది. ప్రస్తుతం కింలో  నాలుగైదు రూపాయలకు మించి రావడం లేదు. గతంలో మార్కెట్‌లో పలికిన ధరకు ఆశపడి టమాట సాగుకు ఉపక్రమించారు. నీరు లేకపోతే అప్పు చేసి మరీ బోర్లు వేయించుకున్నారు. వేయి, పదకొండందల అడుగుల లోతున్న గంగను పైకి తెచ్చారు. 20 రోజుల కిందట పక్క రాష్ట్రాల్లో వర్షాల కారణంగా టమాట ధరలు తగ్గుముఖం పట్టాయని చెప్పిన వ్యాపారులు ఇప్పుడు దిగుబడి గణనీయంగా పెరిగిందంటూ మాట మారుస్తున్నారని రైతులు కంట తడిపెట్టుకుంటున్నారు. 

నిన్నొక మాట..నేడొక మాట..
ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో అక్కడి మార్కెట్లలో టమాటకు డిమాండ్‌ పడిపోయింది. దీంతో స్థానికంగా మార్కెట్‌లోమారుస్తున్నారని రైతులు కంట తడిపెట్టుకుంటున్నారు. 

నిన్నొక మాట..నేడొక మాట..
ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో అక్కడి మార్కెట్లలో టమాటకు డిమాండ్‌ పడిపోయింది. దీంతో స్థానికంగా మార్కెట్‌లో 15 కిలోల బాక్సు రూ.60 వరకు మించి తీసుకోవడం లేదు. కిలో నాలుగైదు రూపాయలతో విక్రయిస్తే సాగుకు పెట్టుబడులేం వస్తాయని రైతులు వాపోతున్నారు. వడ్డీలు, కోత కూలి, మార్కెట్‌కు తరలించడానికి అవుతున్న ఖర్చులను తల్చుకుని కన్నీటిపర్యంతమవుతున్నాడు. రైతుల నుంచి కొనుగో లు చేసిన సరకును వర్తకులు మార్కెట్‌లో రూ. 7 నుంచి రూ.10 వర కు విక్రయిస్తున్నారు. సమీపంలోని కర్నాటకతో పాటు చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలలో టమాట ది గుబడి అధికంగా ఉంది. నెల రోజుల కిందట మంచి ధర ఉన్నా వర్షాభావం వల్ల దిగుబడి తక్కువ వచ్చింది. ఇప్పుడు వర్షాల కారణంగా దిగుబడి పెరిగి నష్టాలను చూడాల్సిన దుస్థితి. మార్కెట్‌కు తరలించినా రేటు గిట్టుబాటు కావడం లేదని చాలా చోట్ల రైతులు  కాయలు కోయకుండా వదిలేస్తున్నారు. తోటల్లోనే కా యలు మాగిపోయి కనిపిస్తున్నాయి. చిత్తూరులోని మదనపల్లి, గుర్రకొండ, కలకడ, కలికిరి మార్కెట్లకు తీసుకెళ్లినా  ఉపయోగం కనిపిం చడం లేదు. రవాణా వ్యయం తడిసిమోపెడవుతోంది. నెల రోజుల కిందట 20 కిలోల బుట్ట వెయ్యి రూపాయల పైబడి పలికిన ధరలు అదే బుట్ట కాయలు నేడు రూ.80 నుంచి రూ.100 మించి పలకడం లేదంటే అతిశయోక్తి కాదు. దూర ప్రాంతాలకు తరలించి నష్టపోవడం కంటే దగ్గరలోని రాయచోటి, కడప, ప్రొద్దుటూరు ప్రాంతాల్లోని మార్కెట్లకు తీసుకువెళ్తున్నారు. కనీసం మోత కూలి కూడా రావడం లేదని రైతులు గద్గద స్వరంతో చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement