విద్యాపీఠం మూగబోయింది | Sakshi
Sakshi News home page

విద్యాపీఠం మూగబోయింది

Published Wed, Apr 22 2015 3:10 AM

today condolence meet

రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం చాన్స్‌లర్, అస్సాం మాజీ గవర్నర్, ఒడిస్సా మాజీ ముఖ్యమంత్రి జానకివల్లభ పట్నాయక్ మృతితో విద్యాపీఠం మూగబోయింది. విద్యాపీఠంలో మంగళవారం జరగాల్సిన 18వ స్నాతకోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన గుండెపోటుతో కన్నుమూయడం విద్యార్థులను కలచి వేసింది. విద్యాపీఠంలోని అన్ని కార్యక్రమాలు రద్దు అయ్యాయి. విద్యాపీఠం మూగబోయింది. నేడు సంస్మరణ సభ జరుగనుంది.
 
యూనివర్సిటీక్యాంపస్:  ఒరిస్సాకు చెందిన జేబీ పట్నాయక్ 2007 సంవత్సరం సెప్టెంబర్‌లో విద్యాపీఠం చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. ఈయన పదవీ కాలం 2012లో ముగిసింది. అయినా ఈయనను చాన్స్‌లర్‌గా నియమించారు. 2017, సెప్టెంబర్‌కు ఈయన పదవీకాలం ముగియాల్సి ఉంది. సంస్కృత విద్యాపీఠం డీమ్డ్ యూనివర్సిటీ కావడంతో అప్పుడు అస్సోం గవర్నర్‌గా పనిచేస్తున్న జేబీ పట్నాయక్‌ను విద్యాపీఠం వైస్ చాన్స్‌లర్‌గా నియమించారు.

విద్యాపీఠం చాన్స్‌లర్ జేబీ పట్నాయక్ ఆకస్మిక మృతితో మంగళవారం జరగాల్సిన  స్నాతకోత్సవాన్ని రద్దు చేశారు. ఈయన సంస్మరణ సభను బుధవారం నిర్వహిస్తున్నట్టు  విద్యాపీఠం పీఆర్‌వో దక్షిణామూర్తిశర్మ తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement