జగన్‌కు మద్దతుగా..అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలి వస్తారని అనుమానంతో చంచల్‌గూడ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ : రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. మరోవైపు జగన్‌కు మద్దతుగా..అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివస్తారని అంచనా వేస్తున్న జైలు అధికారులు.. చంచల్‌గూడ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. ఇటు జగన్ నిరవధిక నిరాహార దీక్షకు సీమాంధ్రజిల్లాలో పెద్దఎత్తున ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఎక్కడిక్కడ రోడ్లెక్కుతున్నారు. రాష్ట్రాన్ని ముక్కలుచేసిన కాంగ్రెస్ తీరును ఎండగడుతున్నారు.